జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి యూసుఫ్‌గూడ డివిజన్‌లోని ఐలంకాలనీలో డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రజలకు ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.