అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

1422చూసినవారు
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
మధురానగర్ రాణా పరిధిలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో గల మణికంఠ బాలుర హాస్టల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సురేశ్ (42) ఆదివారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నోటి నుంచి నురుగు కక్కుతూ నేలపై పడిపోయి ఉండటాన్ని తోటి మిత్రులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సురేశ్ మేనల్లుడు మురళీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్