ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు డిసెంబరు 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ గడువు ముగిసిన వెంటనే, పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంచాయతీ ఎన్నికల్లో గుర్తుల కేటాయింపు పూర్తిగా తెలుగు అక్షర క్రమం ఆధారంగా ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్ వేసిన డాక్యుమెంట్‌లో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తుల కేటాయింపు జరుగుతుంది.