జూబ్లీహిల్స్ ప్రచారానికి పవన్ కల్యాణ్?

7చూసినవారు
జూబ్లీహిల్స్ ప్రచారానికి పవన్ కల్యాణ్?
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి రాబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారని జనసేన తెలంగాణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్ తెలిపారు. టీ బీజేపీ నేతలతో సమావేశం అనంతరం ఈ విషయం తెలిపారు. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నందున పవన్ ఇక్కడ బీజేపీకి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇది బీజేపీకి కలిసి వచ్చే అంశమనే చెప్పవచ్చు.

సంబంధిత పోస్ట్