కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై షకీల్ ఖాన్ తీవ్ర ఆగ్రహం

6చూసినవారు
కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై షకీల్ ఖాన్ తీవ్ర ఆగ్రహం
టీమ్ రేవంత్ నాయకుడు షకీల్ ఖాన్ శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముస్లింలపై బహిరంగ ద్వేషాన్ని వెల్లడిస్తున్నాయని ఆరోపించారు. ఇది రాజకీయ విమర్శ కాదని, మానసిక విషపూరిత ఆలోచనకు నిదర్శనమని ఆయన అన్నారు. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా లేక రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :