తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏపీ ఉపముఖ్యమంత్రి,
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, ఇది నాలుగు కోట్ల ప్రజల జాగీరు అని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పవన్, ఇక్కడికి వచ్చి చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. పవన్‌ను ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అని విమర్శించిన మంత్రి, కొండగట్టు ఆలయానికి ఇచ్చిన నిధులు ఆయన సొంత సొమ్మా అని ప్రశ్నించారు. చనిపోయిన గద్దర్‌కు కారు కొనిచ్చానని పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ, దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ ఇక్కడ మీటింగ్ పెట్టడం కావాలని రెచ్చగొట్టడమేనని విమర్శించారు. పవన్ తిరిగితే జనాలు వస్తారు కానీ, ఓట్లు వేయరని పొన్నం జోస్యం చెప్పారు. రాజకీయంగా పవన్ వచ్చినా, పోయినా తెలంగాణకు నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.