హోళీ పండుగ వేళ నగరంలోని ప్రధాన రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, తిరుమలగిరిలో ట్రాపిక్ గణనీయంగా తగ్గింది. సాధారణంగా రోజు వాహనాలతో రద్దీగా ఉండే ఈ మార్గాలు మంగళవారం ఖాళీగా కనిపించాయి. చంద్ర గ్రహణం ఉందనో లేక సెలవును కుటుంబ సభ్యులతో గడపలని అనుకున్నారో ఏదైతేనేం రాకపోకలు మాత్రం ఎప్పుడూ లేనంతగా గణనీయంగా తగ్గాయి.