సినిమాల్లో నటించాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చిన అనకాపల్లికి చెందిన వడపల్లి సంజయ్ (55) గుండెపోటుతో మృతి చెందాడు. బంజారాహిల్స్‌లోని ఒక సినిమా కార్యాలయంలో ఆడిషన్స్ కోసం ప్రయత్నించి, అవకాశం దక్కకపోవడంతో నిరాశకు గురైన సంజయ్, కార్యాలయం నుండి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురై కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.