మధురానగర్ అపార్ట్మెంట్లో విషాదం: ఏసీ బిగిస్తూ ఎలక్ట్రిషియన్ మృతి

0చూసినవారు
మధురానగర్ అపార్ట్మెంట్లో విషాదం: ఏసీ బిగిస్తూ ఎలక్ట్రిషియన్ మృతి
మధురానగర్లోని ఎస్సార్ హాస్పిటల్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఏసీ బిగిస్తున్న సమయంలో ఓ ఎలక్ట్రిషియన్ ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you