టోలిచౌకిలోని ఓ రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిని పాతబస్తీకి చెందిన 8మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి రెస్టారెంట్‌లో మండీ బిర్యానీతో పాటు నిషేధిత మయోనీస్ తిన్న వీరికి శనివారం ఉదయం నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. బాధితులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రెస్టారెంట్ యజమాని సాలంపై ఖాలేద్ అనే వ్యాపారి టోలిచౌకి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.