టోలిచౌకిలో ఆటో డ్రైవర్ దారుణ హత్య

1884చూసినవారు
టోలిచౌకిలో ఆటో డ్రైవర్ దారుణ హత్య
టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఆటో డ్రైవర్ మహమ్మద్ అయ్యూబ్ (25) దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతని మెడకు ప్లాస్టిక్ వైరు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీసీపీ చంద్రమోహన్, ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్