ప్రజా సమస్యలకు తప్పకుండా పరిష్కారం చూపిస్తామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యేను కలిశారు. ప్రతి ఒక్కరి సమస్యను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.