గణేష్ మండపం షెడ్ వివాదంలో ఘర్షణ

601చూసినవారు
కుల్షంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ షెడ్ స్థలం వివాదం ఘర్షణకు దారితీసింది. షెడ్ తొలగించే ప్రయత్నాన్ని బస్తీవాసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో పెప్పర్ స్ప్రే, కర్రలు, రాళ్లతో దాడి జరిగిందని బాధితులు తెలిపారు. ముగ్గురికి గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్