మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణ స్వాభిమానాన్ని ఢిల్లీలో చాటినా,
కాంగ్రెస్ ఆయనకు దక్కాల్సిన గౌరవం ఇవ్వలేదని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ K. కవిత ఆదివారం హైదరాబాద్ లోని కార్యాలయంలో అన్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని కాపాడిన పీవీ మేధస్సును గౌరవించకపోవడం
కాంగ్రెస్ కుసంస్కారమని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీవీ అడుగుజాడల్లో నడుస్తామని ఆమె స్పష్టం చేశారు.