టప్పచాబుత్రా పోలీస్ కానిస్టేబుల్ సురేష్ సమయస్ఫూర్తితో ఓ విద్యుత్ కార్మికుడి ప్రాణాలు నిలిచాయి. విద్యుత్ స్తంభంపై పని చేస్తూ కరెంట్ షాక్ కు గురై స్పృహ తప్పి పడిపోయిన కార్మికుడికి కానిస్టేబుల్ సురేష్ వెంటనే సీపీఆర్ అందించి ఊపిరి పోశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీస్ సత్వర స్పందనపై స్థానికులు అభినందనలు తెలిపారు.