నేటి కాలుష్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని రసూల్ గుల్షాన్ కాలనీ, పంచ్ భయ్ కమాన్ పరిసర ప్రాంతాల్లో జలమండలి అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వాటర్ పొల్యూషన్ సమస్యలకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మరోసారి సమస్యలు పునరావృతం కాకూడదన్నారు.