హైదరాబాద్: 48 గంటల్లో కిడ్నాప్ కేసు క్లియర్

862చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో 6 నెలల పసిపాప కిడ్నాప్ కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న తల్లి ఒడినుంచి పాపను అపహరించారు. తల్లి నవీనత ఫిర్యాదుతో 4 ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టాయి. రాజేంద్రనగర్ సమీపంలో 5గురు నిందితులను అరెస్ట్ చేసి, పాపను క్షేమంగా రికవరీ చేసి తల్లికి అప్పగించారు. శ్రీదేవి అనే మహిళ క్యాటరింగ్ సిబ్బందితో కలిసి ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైనవారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. నిందితుల నుండి బైక్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్