మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ పనులు చేస్తున్న లైన్మెన్ ఏ.సతీష్ కుమార్ (42) విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. పల్లె చెరువు సమీపంలో ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సరఫరాలో పనులు చేపడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సతీష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన 2015లో విద్యుత్ శాఖలో ఉద్యోగంలో చేరాడు.