నకిలీ పత్రాలతో 'షాదీ ముబారక్' పథకం లబ్ధిదారుల పేరిట రూ. 21 లక్షల ప్రభుత్వ నిధులను కాజేసిన ఆరుగురు సభ్యుల ముఠాను శనివారం అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోటోషాప్ సాయంతో నకిలీ ఆధార్ కార్డులు, వివాహ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో బండ్లగూడ స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అశోక్ కిరణ్ సహకరించినట్లు గుర్తించారు.