చర్లపల్లి జైలులో ఖైదీలకు నైపుణ్య శిక్షణ అందిస్తూ, దుర్రీలు, కార్పెట్లు, ఫినైల్, సబ్బులు, సానిటైజర్లు, డిటర్జెంట్ పౌడర్లు, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు, యోగా మ్యాట్లు, బెడ్ షీట్లు, టేబుల్స్, కుర్చీలు వంటి అనేక రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ప్రిజన్స్ DG సౌమ్య మిశ్రా ఈ వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.