డ్రైనేజీ పనులు పూర్తి చేయాలంటూ బస్తీవాసుల నిరసన

0చూసినవారు
డ్రైనేజీ పనులు పూర్తి చేయాలంటూ బస్తీవాసుల నిరసన
హైదరాబాద్‌లోని బాబుల్ రెడ్డి నగర్, పోచమ్మ గుడి లైన్ బస్తీలో డ్రైనేజీ పనుల కోసం రోడ్డు తవ్వి మూడు వారాలు గడిచినా మరమ్మతులు చేపట్టకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తవ్విన రోడ్డుతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్ల ముందు కనీస శుభ్రత పనులు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రజల ఇబ్బందులను అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించిన బస్తీవాసులు, వెంటనే రోడ్డు మరమ్మతులు పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you