జియాగూడలోని స్లాటర్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈనెల 2న జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేసిన ఈ కేంద్రానికి వెళ్లిన కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్, స్వయంగా తాళాలు పగులగొట్టించి లోపలికి ప్రవేశించారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో అధికారులు సీల్ వేయగా, ఎమ్మెల్యే చర్య ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.