
ఖైరతాబాద్: ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ముగిసిన విచారణ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసు విచారణ శనివారం ముగిసింది. ఈ కేసుతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన అంశంపై కూడా తీర్పును స్పీకర్ గడ్డం ప్రసాద్ రిజర్వ్ చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తైంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. త్వరలోనే మిగిలిన కేసులపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.





































