సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేశవ్ రావు నేతృత్వంలో గురువారం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్, కోదండరాం, అద్దంకి దయాకర్ తో పాటు
కాంగ్రెస్, బీఆర్ఎస్,
బీజేపీ, సీపీఐ,
టీడీపీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపునకు సంబంధించి వివిధ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను కమిటీకి తెలియజేశాయి. ఈ సమావేశం ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియలో కీలకమైనదిగా భావిస్తున్నారు.