
గ్యాస్ రాలేదని భార్య ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో గ్యాస్ సిలిండర్ రాలేదనే కోపంతో భార్య మహాలక్ష్మి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మూడు రోజులుగా భర్త హరికృష్ణ గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదని, గ్యాస్ కొరతతో ఏజెన్సీ నిర్వాహకులు ఇవ్వలేదని ఆమె ఆవేదన చెందింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఫినాయిల్ కక్కించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఆవేశంలో భార్య ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.




