మంగళవారం బంజారాహిల్స్ లో మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేణు మాధవ్,
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ పర్యటనలో హామీలు తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదని విమర్శించారు. కాళేశ్వరం అంశంపై ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. వరంగల్‌కు నిధులు, కాజీపేట్ యూనిట్, మమునూర్ ఎయిర్‌పోర్టుపై స్పష్టత ఇవ్వలేదన్నారు. తెలంగాణపై
బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు.