ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం పర్యటిస్తున్నారు: హరీష్ రావు

7చూసినవారు
తెలంగాణలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని, ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేసినా మున్సిపాలిటీలోనే కార్యక్రమాలు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మున్సిపాలిటీలో శంకుస్థాపన చేసే నీటి ప్రాజెక్టులు, రోడ్లు, అభివృద్ధి పనులు గ్రామ ప్రజలను ప్రభావితం చేయవా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న రేవంత్ రెడ్డి పర్యటనలను సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్