తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో త్యాగాలు చేశామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు, పదవుల కోసం
ఎన్నికలు, ఎంపికలు, వసూళ్ల పేరుతో ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపించారు. నిజమైన త్యాగధనుడైన కొండా లక్ష్మణ్ బాపూజీని విస్మరించిన వారు త్యాగాల గురించి మాట్లాడటం విడ్డూరమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.