ఖైరతాబాద్ లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం
విద్యార్థులు సంపాదకులుగా రూపొందించిన 'గురుదక్షిణ' కవితా సంకలనానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఐఏఎస్ ఏనుగు నరసింహారెడ్డి శనివారం ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురితమైన ఈ సంకలనం గురువుల గొప్పదనాన్ని చాటుతుందని, విద్యార్థి దశలోనే సంపాదకులుగా వ్యవహరించడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. సమాజాన్ని మేలుకొల్పే రచనలు చేయాలని సంపాదకులకు సూచించారు.