శుక్రవారం బంజారాహిల్స్ పరిసరాల్లో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి జలగం వెంగళరావు పార్కు సమీపంలో రోడ్డుపై పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే హైడ్రా బృందం రంగంలోకి దిగింది. హైడ్రా ఎస్ఎఫ్ఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆధునిక కటింగ్ మెషీన్లను ఉపయోగించి రోడ్డుపై పడిన చెట్లను ముక్కలుగా నరికి వేగంగా తొలగిస్తున్నారు.