ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదేశాల మేరకు, సోమాజిగూడ డివిజన్ అమీర్పేట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి నాగరాజు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ కార్యక్రమంపై గురువారం అవగాహన కల్పించి, ఎన్యూమరేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.