తెలంగాణలో గ్రూప్-2 తుది ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తుది ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించారు. మొత్తం 783 పోస్టులకు గాను 782 పోస్టులకు ఫలితాలు వెలువడ్డాయి. ఒక పోస్టును కోర్టు కేసు కారణంగా నిలిపివేశారు. 2022లో టీజీపీఎస్సీ 783 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. దసరా లోపు నియామక పత్రాలు అందించాలని కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
