హై-ఫ్రో ఫీడ్స్ నుంచి కార్నివా 36/7 చేపల ఆహారం విడుదల

1చూసినవారు
ప్రముఖ ఆక్వాకల్చర్ న్యూట్రీషన్ సంస్థ హై-ఫ్రో ఫీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చేపల ఆహార ఉత్పత్తి 'కార్నివా 36/7'ను మార్కెట్లోకి విడుదల చేసింది. బేగంపేటలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, రంగారెడ్డి జిల్లా ఫిషరీష్ ఆఫీసర్ పూర్ణిమ ఈ కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మత్స్యకారులకు అండగా నిలిచేందుకు మరిన్ని పరిశోధనలు చేసి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థలను కోరారు. హై-ప్రో ఫీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ షహాబుద్దీన్ అక్మల్ మాట్లాడుతూ, ఈ ఫీడ్లో 36% అధిక నాణ్యత గల ప్రోటీన్, 7% ఫ్యాట్ ఉండడం వల్ల చిటాల్, పట్టా, సింగి వంటి మాంసాహారి చేపలకు అనుకూలంగా ఉంటుందని, ఫింగర్లింగ్ దశ నుంచి హార్వెస్ట్ వరకు చేపల పూర్తి జీవన చక్రంలో దీనిని ఉపయోగించవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :