హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాగ్వాదం

4చూసినవారు
తెలంగాణ అసెంబ్లీలో అక్రమ మైనింగ్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హరీశ్ రావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, హరీశ్ రావు అందుకు అంగీకరించకుండా, దీనిపై చర్చించేందుకు హౌస్ కమిటీ వేయాలని కోరారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. ఈ పరిణామాలతో అసెంబ్లీలో మైనింగ్ వివాదం తీవ్రమైంది.

సంబంధిత పోస్ట్