హైదరాబాద్‌లో రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేబీఆర్ పార్క్, శామీర్‌పేట్ రోడ్లపై విన్యాసాలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేసిన 19 ఏళ్ల జెప్టో డెలివరీ బాయ్ షాదాబ్‌పై బంజారాహిల్స్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియా లైకులు, ఫాలోవర్ల కోసం ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.