తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీసు యూనిఫామ్ ధరించి, రీల్స్ చేసిన ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిఖిల్ యాదవ్ అనే వ్యక్తి పోలీసు కానిస్టేబుల్‌లా నటించి, తప్పుడు సోషల్ మీడియా రీల్స్ పోస్ట్ చేశాడు. సచివాలయంలోకి సందర్శకుల పాస్‌తో ప్రవేశించి, అక్కడ నకిలీ పోలీసు యూనిఫామ్‌లో రీల్స్ చేశాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర రాజకీయ నాయకులకు తనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారితో మీటింగ్స్ ఏర్పాటు చేస్తానని నమ్మబలికాడు. ఈ ఘటనపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసుతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.