కార్పొరేట్ కళాశాలల్లో సాంకేతిక సమస్యలు, ఇతర కారణాల వల్ల బోర్డు పరీక్షల ఫీజు చెల్లించలేని విద్యార్థులకు చివరి అవకాశం కల్పించాలని తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని కోరింది. ఈ మేరకు జాయింట్ సెక్రటరీ మోహన్‌కు వినతిపత్రం అందించింది. జన సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కళాశాలలు ఫీజులు వసూలు చేస్తున్నా, విద్యార్థుల బోర్డు పరీక్షల ఫీజులు చెల్లించడం లేదని, ఆన్‌లైన్ అడ్మిషన్లు కూడా చేయడం లేదని ఆరోపించారు.