సింగూరు ప్రాజెక్టు భద్రత, సాగునీటి పనులపై మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. డ్యాం సేఫ్టీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, కాలువల లైనింగ్ పనులను జూన్ 26లోగా ముగించి జూలై నెలకల్లా రైతులకు సాగునీరు అందించాలని ఆదేశించారు. పెద్దారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, స్కీమ్ డీపీఆర్ లను వేగంగా సిద్ధం చేసి ఉగాది నాటికి శంకుస్థాపన చేయాలని సూచించారు.