కాలి వేళ్లతో అద్భుత సృష్టి.. గవర్నర్ సత్కారం (వీడియో)

3చూసినవారు
చేతులు సహకరించకపోయినా, కాలివేళ్లతో అద్భుతమైన చిత్రాలు గీస్తూ GHMC ఉద్యోగిని ములే వైష్ణవి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె గీసిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. ఈ చిత్రపటాన్ని చూసి గవర్నర్ శుక్లా సైతం ఆశ్చర్యపోయారు. వైష్ణవి పట్టుదలకు ముగ్ధులైన గవర్నర్ ఆమెను ఘనంగా సత్కరించి, అభినందించారు. దృఢ సంకల్పం ముందు వైకల్యం ఓడిపోతుందని వైష్ణవి నిరూపించారని శుక్లా ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్