
తిరుపతి SV యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
AP: తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సైకాలజీ విభాగంలో సీనియర్లు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్‌కు గురి చేసినట్టు సమాచారం. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన విద్యార్థులపై విభాగాధిపతి విశ్వనాథ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ‘ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు’ అని మాట్లాడారని పేర్కొంటూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ఘటనతో యూనివర్సిటీ వాతావరణం ఉద్రిక్తంగా మారింది.




