ఢిల్లీలో జరిగిన సమావేశంలో వీబీజీ చట్టంపై తెలంగాణ మంత్రి సీతక్క రాష్ట్ర అభ్యంతరాలను బలంగా వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచనలు, అభ్యంతరాలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రం ప్రతిపాదించిన అంశాలకు అంగీకారం తెలిపిన కేంద్రం, చట్టంలో కొన్ని మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్, ప్లాంటేషన్ పనులతో పాటు ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించే దిశగా కేంద్రం ముందుకు వచ్చినట్లు సమాచారం.