ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్) జూన్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 16వ తేదీ నుంచి 22 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెట్
పరీక్షలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో
పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11.30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు రెండో సెషన్ ఉంటుందని టిజి టెట్ కన్వీనర్, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ రమేష్ తెలిపారు.