హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మంగళవారం ముదిరాజ్ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముదిరాజుల రిజర్వేషన్ అంశంపై 'ముదిరాజ్ సింహావలోకనం' పేరుతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, ముదిరాజులు తమ న్యాయమైన వాటాను అడుగుతున్నారని అన్నారు. బీసీలలో సిప్ సి రిపోర్టుపై సమగ్రంగా చర్చించిన మొదటి సమావేశం ముదిరాజుల సమావేశమేనని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అభిప్రాయపడ్డారు. డాక్టర్ దినేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముదిరాజుల రిజర్వేషన్ అంశంపై మేథోమథనం జరిగింది.