హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికను టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత శనివారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దారుణానికి ఒడిగట్టిన నిందితుడు గౌస్ పాషాను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, బాలికకు నెలకు రూ. 50 వేల పింఛన్, తల్లిదండ్రులకు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఇటువంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు.