తెలంగాణలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌ను 5 నెలల్లో విడుదల చేయాలని, 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రిక్రూట్‌మెంట్ బోర్డు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. పలువురు నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.