హైదరాబాద్‌లోని గన్పార్క్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25వ రజతోత్సవ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణలో 12 ఏళ్ల తర్వాత మళ్లీ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆంధ్ర నేతల విగ్రహాలు పెట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.