కూకట్‌పల్లి - Kukatpally

జూబ్లీహిల్స్: రౌడీయిజమే గెలిచింది: మాగంటి సునీత ఎమోషనల్

జూబ్లీహిల్స్: రౌడీయిజమే గెలిచింది: మాగంటి సునీత ఎమోషనల్

బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆడబిడ్డపై కుట్రలు చేసి, రౌడీయిజంతో గెలిచారని ఆమె ఆరోపించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారని, అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని, దీనిని గెలుపుగా పరిగణించలేమని అన్నారు. తన భర్త ఉన్నప్పుడు ఇలాంటి ఆటలు సాగలేదని, కాంగ్రెస్ గెలుపు నైతిక గెలుపు కాదని, కేసీఆర్ ప్రచారం చేయకపోవడం వల్ల ఓడిపోలేదని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో తమ నేతలను ర్యాగింగ్ చేశారని, చీరలపై కూడా చిల్లరగా మాట్లాడటం బాధ కలిగించిందని, జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం మొదలైందని పేర్కొన్నారు. ఉప ఎన్నిక నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని సునీత సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు.

వీడియోలు


హైదరాబాద్