కూకట్‌పల్లి నియోజకవర్గం, భరత్ నగర్ కాలనీలో పారిశుధ్యం, సుందరీకరణపై అవగాహన సదస్సు జరిగింది. సీఎంసీ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. చెత్తను రోడ్లపై వేయకుండా సేకరణ రిక్షాల్లోనే వేయాలని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి సూచించారు. పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అధికారులు చెత్త వేర్పాటును సామాజిక బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.