ఫతేనగర్‌లో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప జయంతి

0చూసినవారు
ఫతేనగర్‌లో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప జయంతి
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్‌లో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అయ్యప్ప జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక శివాలయం, వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు కంచి బిక్షపతి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా హాజరై పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందారు.

ట్యాగ్స్ :