కూకట్‌పల్లి నియోజకవర్గంలో తలసేమియా రహిత తెలంగాణ లక్ష్యంగా చత్రపతి ధర్మ రక్షణ సేన ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ రోడ్ నం. 1లో రక్తదాన శిబిరం నిర్వహించారు.
జనసేన పార్టీ సైబరాబాద్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, రక్తదానం ప్రాణాలను కాపాడుతుందని, అత్యవసర పరిస్థితుల్లో ఇది కీలకమని తెలిపారు. వేసవిలో రక్త కొరత ఎక్కువగా ఉంటుందని, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో 122 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.